సమస్యల పరిష్కారం కోసమే ‘మార్నింగ్ వాక్’
● ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చెన్నూర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మా ర్నింగ్ వాక్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని ప లు వార్డుల్లో గురువారం ఆయన మార్నింగ్ వాక్ ని ర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. సమస్యల పరిష్కారం కోసం తన చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో తాను ప్రజల వద్దకు వస్తున్నానని తెలిపారు. అనంతరం పట్టణంలోని పుప్పాల హనుమాన్ మందిర్ వీధిలో రూ.1.99కోట్ల నిధులతో రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కల్పించాలని వినతి
కోటపల్లి: చెన్నూర్ నుంచి వెంచపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని మాజీ సర్పంచ్లు లక్ష్మ ణ్గౌడ్, సంతోష్, మాజీ ఎంపీటీసీ జేక శేఖర్ గురువారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. ఎదులబంధం, లింగన్నపేట గ్రామా ల మధ్య వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. అటవీశాఖ అనుమతులు తీసుకొని రోడ్డు నిర్మిస్తే బస్సు సౌకర్యం కల్పించవచ్చని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రోడ్డుకు మరమ్మతు చేయించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు మాజీ సర్పంచ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాగామ శ్రీశైలం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment