గుప్తనిధుల ముఠా అరెస్టు
పెంచికల్పేట్: మండలంలోని లోడ్పల్లి బీట్ పరిధిలో సిద్ధేశ్వర గుట్టల్లో గుప్తనిధుల తవ్వకానికి వచ్చిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పెంచికల్‌పేట ఎఫ్ఆర్వో అనిల్‌కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా రెండు కార్లలో వచ్చిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు. బొంబాయిగూడకు చెందిన వసంతరావు, కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్, వెంకన్న, సురేందర్, వెంకన్న, అంజన్న, రమేశ్‌పై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి రెండు కార్లను సీజ్ చేశారు. ఈ దాడుల్లో డీఆర్వో జమీల్ అహ్మద్, ఎఫ్ఎస్వో వేణుగోపాల్, ఎఫ్‌బీవో మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
గుప్తనిధుల తవ్వకాల కలకలం
చెన్నూర్‌రూరల్: చెన్నూర్ మండలంలోని కన్నెపల్లిలో గుప్త నిధుల తవ్వకాలు ఘటన కలకలం రేపింది. కన్నెపల్లిలో పాడు బడిన ఇంటిలో ఆదివారం గుప్త నిధుల కోసం ఇంటి యజమానితో పాటు పలువురు తవ్వకాలు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి ఆరు సెల్ఫోన్లు, ఒక ఆటో, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. కొద్దిరోజులుగా ఈ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment