‘ఆటవెలదిలో అమెరికా’ పుస్తక పరిచయం
మంచిర్యాలఅర్బన్: జిల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక కృష్ణవేణి పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సాహితీ సంరక్షణ సమితి అలరించింది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన సబ్బని లక్ష్మీనారాయణ రచించిన ఆటవెలదిలో అమెరికా అనే పుస్తకాన్ని సంస్థ అధ్యక్షుడు వామన్‌రావు పరిచయం చేశారు. 2018లో తన అమెరికా అనుభవాలను పద్య కావ్యం ఆటవెలదిలో అమెరికా శతకాన్ని తన ప్రయాణ అనుభవాలను అమెరికా విశేషాలను, తెలుగువారి అప్యాయత, అదరించిన తీరు వర్ణించారన్నారు. నగలు నట్రలేవు వారి హృదయమున అంటూ వారి మనుసులను ఉదహరించారని తెలిపారు. వృత్తి అంగ్లోపన్యాసకుడిగా, ప్రవృత్తి సాహిత్య సేద్యం చేస్తూ లక్ష్మీనారాయణ కలం నుంచి 41 పుస్తకాలు ఆవిష్కరించారన్నా రు. సాహిత్య వేదికలను స్థాపించటం, ఏడు ఆడియో గీతాల క్యాసెట్ల ఆవిష్కరణ, ఎన్నో అవార్డులు దక్కించుకున్నారని కొనియాడారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అల్లాడి శ్రీనివాస్, మహిళా కార్యదర్శి అడ్డగూరి శ్రీలక్ష్మీ, సంతోష్ కవితాగానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment