అన్ని పోటీల్లో పాల్గొనేలా చూస్తాం
● ట్రిపుల్‌ఐటీ వీసీ గోవర్ధన్
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో చదివే విద్యార్థులను దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని పోటీలకు పంపిస్తామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఆటోవన్– 24 పోటీల్లో రాణించిన విద్యార్థులను ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనేలా చూస్తామని, అన్ని రంగాల్లో రాణించేలా ప్రొత్సహిస్తామని చెప్పారు.
రెండోస్థానంలో ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు
హైదరాబాద్ బిట్స్‌పిలానిలో ఈనెల 22, 23 తేదీ ల్లో ఆటోవన్ 24 పోటీలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు రెండోస్థానంలో నిలిచారు. మెకానికల్, మెటలార్జికల్ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు పాల్గొని ‘మెటీరియల్స్ టెక్నాలజీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్’ అనే పోస్టర్ ప్రదర్శించారు. విద్యార్థుల కృషిని గుర్తించిన అక్కడి న్యాయనిర్ణేతలు రెండోస్థానం కేటాయించారు. రూ.8వేల నగదు బహుమతి ఇచ్చి ప్రొత్సహించారు.
Comments
Please login to add a commentAdd a comment