పక్షులు పర్యావరణ మిత్రులు
చెన్నూర్: పక్షులు పర్యావరణ మిత్రులని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివకుమార్ అన్నారు. రెండు రోజు లుగా మంచిర్యాల రేంజ్ పరిధిలోని శివ్వారం వైల్డ్‌లైఫ్ సాంక్చురీ, గొల్ల వాగు ప్రాజెక్ట్, చెన్నూ ర్ రెంజ్ పరిధిలోని అర్బన్ ఎకో పార్క్‌లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ బృందం సభ్యులతో కలిసి పక్షులు, కీటకాలు, జీవరాసులపై సర్వే చేశారు. స్థానిక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఆదివా రం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ బృందం ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన మంచిర్యాల, చెన్నూర్, కోటపల్లి, నీ ల్వాయి రేంజ్ ఆఫీసర్లు, సిబ్బందితో కలిసి పక్షులు, కీటకాలు, జీవరాసులపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల సర్వేలో 150 రకాల పక్షులు, 30 రకాల సీతాకోక చిలుకలను గుర్తించామన్నారు. శీతాకాలంలో నది పరీవాహక ప్రాంతాలకు వివిధ రకాల పక్షులు, బట్టర్‌ఫ్లైలు వలస వస్తుంటాయని, వీటిని సంరక్షించుకోవాలన్నారు. అటవీ ప్రాంతాల్లో పులులు, అడవి జంతువులే కాకుండా ఎ న్నో రకాల బర్డ్స్, బట్టర్‌ఫ్లైలు ఉంటాయన్నా రు. అనంతరం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ ఉత్తర భారత దేశంలో పక్షలు గోదావరి తీర ప్రాంతాలలో 8 వేల కోట్ల విలువైన ఎరువులను విసర్జిస్తుందన్నారు. చెరువులు, కుంటలకు కొత్త రకం బాతులు, కొంగలు వలస వస్తుంటాయని, వాటి ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు. పక్షులు, కీట కాలు వలస వస్తే ఈ ప్రాంతాల్లో వాటి సంతతి పెరుగుతుందన్నారు. మానవళి బర్డ్స్, బట్టర్‌ఫ్లై లకు హాని తలపెట్టవద్దని సూచించారు. సమావేశంలో నీల్వాయి, కోటపల్లి, మంచిర్యా ల రేంజ్ ఆఫీసర్లు అప్పలకొండ, సదానందం, రత్నా కర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రిసోర్స్ పర్సన్లు హర్ష, సోహాన్, డీఎఫ్‌వో ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment