యువకుడి చికిత్సకు చేయూత | - | Sakshi
Sakshi News home page

యువకుడి చికిత్సకు చేయూత

Published Mon, Nov 25 2024 7:32 AM | Last Updated on Mon, Nov 25 2024 7:32 AM

యువకు

యువకుడి చికిత్సకు చేయూత

ఖానాపూర్‌: పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన అమంద కిరణ్‌ కొంతకాలంగా కడుపు ఉబ్బరం, లివర్‌ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయమై ఈ నెల 18న ‘సాక్షి’లో ‘దాతల సాయంకోసం ఎదురుచూపు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన దాతలు కరిపె రాజ్‌కుమార్‌, పాల మహేశ్‌, ఇరాక్‌ రాజు, గంగాధర్‌, వినోద్‌, సైబెవార్‌ ఆంజనేయులు, చంద్రవిలాస్‌, కాలేరి రమేశ్‌, సత్యనారాయణ రూ.15వేల వరకు ఫోన్‌పే ద్వారా సాయం అందించారు. ఆదివారం కాంగ్రెస్‌ నాయకుడు వేల్పుల రమేశ్‌ తన సొంత ఖర్చుతో వాహనాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించాడు. కాగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యాధికారులు పేర్కొన్నారు. దాతలు స్పందించి ఆదుకుంటే తప్ప కిరణ్‌ బతికే అవకాశం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
యువకుడి చికిత్సకు చేయూత1
1/1

యువకుడి చికిత్సకు చేయూత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement