ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలి
● గైర్హాజరు అధికారులకు నోటీసులు ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీ వోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్, పరిహారం, తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చే అర్జీలపై అధికారులు స్పందించాలని సూ చించారు. ప్రజావాణికి గైర్హాజరైన ఎకై ్సజ్, లెబర్ ఆఫీసర్, తదితర శాఖల అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏవోను ఆదేశించారు.
● ముఖ్యమంత్రి గిరి వికాస్(సీఎంజీవీఎస్) పథకం కింద నెన్నెల మండలం కోనపేట గ్రామానికి చెందిన ఎస్టీ రైతులైన తమకు అప్పటి ప్రభుత్వం బోర్లు మంజూరు చేసిందని, బోర్లు వేసి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు విద్యుత్ సరఫరా ఇవ్వలేదని అర్జీ అందజేశారు.
● ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించామని, తూకం సమయంలో బస్తాకు కిలోన్నర అదనం(గన్ని సంచి)గా బరువు కింద 41.300 కిలో తూకం వేశారని, మిల్లుకు వెళ్లిన తర్వాత రైస్‌మిల్లర్ అదనంగా మరో రెండు కిలోల చొప్పున కోతకు ఒప్పకుంటేనే ధాన్యం దించుకుంటామని అంటున్నారని హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment