మోడల్‌స్కూల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅర్బన్: మోడల్‌స్కూల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో సోమవారం డీఈవో యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. విద్యాశాఖ సమగ్ర శిక్షలో టైప్–4 కేజీబీవీ మోడల్ స్కూల్ అటాచ్డ్ గర్‌ల్స్ హాస్టల్‌కు సంబంధించిన ఉద్యోగులు అతితక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని పేర్కొన్నా రు. కనీస వేతన స్కేలును అమలు చేయాలని, ప్రతీ ఉద్యోగికి జీవితా బీమా రూ.10లక్షలు, ఆ రోగ్య బీమా రూ.5లక్షల సౌకర్యం కల్పించాల ని పేర్కొన్నారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం, కేజీబీవీ ఎస్‌వోలు స్వప్న, హరిత, సునిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment