ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ధర్నా
మంచిర్యాలఅగ్రికల్చర్: ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, చెన్నూర్ శివారులోని ప్రభు త్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టా లు ఇవ్వాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చెన్నూర్ మండలానికి చెందిన నిరుపేదలు ధర్నా చేశారు. పార్టీ చెన్నూర్ ఏరియా కమిటీ కార్యదర్శి బొడెంకి చందు మాట్లాడుతూ చెన్నూర్ మండలం బాపురావుపేట శివారు ప్రభుత్వ భూమి లో 700మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలు గుడిసెలు వేసుకుని మూడేళ్లుగా ఉంటున్నారని అన్నారు. కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం..
మంచిర్యాలఅగ్రికల్చర్: ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని జన్నారం మండలం చింతగూడెంకు చెందిన నిరుపేదలు సీపీఐ(ఎంల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లాల్‌కుమార్, టి.శ్రీనివాస్ మాట్లాడుతూ చింతగూడెం పంచాయ తీ పరిధి సర్వే నంబరు 81లో అటవీశాఖ వివాదంగా ఉన్న భూమిని సర్వే చేయించి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. సుమన్, మల్లేష్, రాజన్న, బ్రహ్మనందం, ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment