జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్: జూనియర్ బాలికల జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ముగ్గురు క్రీడాకారులు ఎంపికై నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. లక్సెట్టిపేటకు చెందిన శివాత్మిక, జైపూర్ నుంచి హాసిని, ఆదిలాబాద్ నుంచి సింధూజ ఎంపికయ్యారని తెలిపారు. క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి రమేశ్‌రెడ్డి, కోచ్ హరిచరణ్ అభినందించారు. ఈ నెల 24నుంచి తమిళనాడులో జరిగే పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment