‘క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి’
బెల్లంపల్లి: క్రైస్తవుల అభివృద్ధి, సంక్షేమానికి రా ష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బెల్లంపల్లి ఎమ్మె ల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కేక్‌కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రే మ, శాంతి, సామరస్యానికి క్రైస్తవులు ప్రతీకలని అ న్నారు. క్రిస్మస్‌ను క్రైస్తవులు ఆనందంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటా యిస్తోందని, అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉపాధి అవకాశాలు పెంచడానికి, ప్రత్యేకంగా స్వయం ఉపాధి పథకాలను ప్రవేశ పెట్టిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment