కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి అంగడిలో గురువారం సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. మండలంలోని మహ్మద్‌నగర్‌కు చెందిన యాదాగౌడ్ అంగడిలో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి జేబులో నుంచి సెల్‌ఫోన్ చోరీ చేస్తుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంతలోనే మరో గిరిజన వ్యక్తి తన ఫోన్ పోయిందని స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా నిందితుడి జేబులో అతడి ఫోన్ దొరికింది. దీంతో అతడికి తిరిగి ఇచ్చారు. కాగా నిందితుడు అఖిల్ సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి అని తల్లితో గొడవపడి ఇక్కడికి వచ్చినట్టు చెప్పాడని ఏఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. అతడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని.. అధికారుల సూచన మేరకు వదిలేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment