మాది ప్రజల ప్రభుత్వం
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రామాయంపేట(మెదక్): మాది ప్రజా ప్రభుత్వమని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. ఆదివారం రామాయంపేటలో కూరగాయల మార్కె ట్‌తో పాటు చిత్తారమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతకుముందు దామ రచెరువులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామాయంపేట అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని, గత ప్రభుత్వం అభివృద్ధిని ఎంతమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయ ప్రగతిని వదిలేశారని ఆరోపించారు. అనంతరం రామాయంపేట కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా వ్యాపారులు ఎమ్మెల్యేను కూరగాయల దండతో సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment