‘ప్రజా సంక్షేమానికి కృషి’
పాపన్నపేట(మెదక్)/హవేళిఘణాపూర్: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం బాలనగర్‌లో నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు నిర్ణ యం తీసుకున్నామని తెలిపారు. అలాగే పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్‌పల్లి తండాలో లబ్ధిదారులకు ధుృవపత్రాలు అందజేశారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సురేష్‌బాబు, ఎమ్మార్వో సతీష్ కుమార్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు గోవింద్ నాయక్, ప్రశాంత్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, శ్రీనివాస్, గౌస్, నాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment