మా పాలనలో ప్రగతి పరుగులు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పల్లెలు, పట్టణాలు, మున్సిపాలిటీలు గణనీయంగా అభివృద్ధి సాధించాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. పదవీ కాలం ముగిసిన మున్సిపల్ కౌన్సిలర్లకు ఆదివారం పార్టీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో కేసీఆర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు, గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. 2014 ముందు మెదక్ మున్సిపాలిటీలో నీటి సమస్య ఉండేదని, మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నామని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. అంతకుముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment