‘ఆత్మీయ భరోసా’తో పేదలకు మేలు
అదనపు కలెక్టర్ నగేష్
చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో నిరుపేదలకు మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఆదివారం మండలంలోని మిర్జాపల్లితండాలో నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ధృవపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని తెలిపారు. ఎవరైన అర్హుల పేర్లు రాకపోతే అధికారులు విచారించి న్యాయం చేస్తారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, తహసీల్దార్ మన్నన్, ఏపీఓ రాజ్‌కుమార్, గ్రామ కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment