‘లష్కర్’కు పోటెత్తిన భక్తజనం
మల్లన్న నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి క్షేత్రం
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. రెండో ఆదివారం (లష్కర్ వారం) భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణంతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. సంక్రాంతి తర్వాత వచ్చే రెండో ఆదివారాన్ని లష్కర్ వారంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, జిల్లాలనుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం గంగరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా అలంకరించారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment