సర్వే ముమ్మరం.. సేకరణలో నిమగ్నం
● గ్రామీణ ప్రాంతాల్లో 69.63 శాతం ● అర్బన్‌లో 77.66 శాతం
56 అంశాలు... 75 ప్రశ్నలు
సర్వే 56 అంశాల్లో 75 ప్రశ్నలతో కూడిన ఫారం పూర్తి చేసేందుకు ఒక్కో కుటుంబం వద్ద సుమారు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతోంది. ఇందులో పార్ట్–1లో కుటుంబ యజమాని పేరు, పార్ట్–2లో కుటుంబ సభ్యులకు ఉన్న అప్పులు, ఆస్తులు, పశు సంపద తదితర వివరాలు నమోదు చేయాలి. అలాగే కొంతమంది ప్రజలు తమ ఆస్తులు, అప్పుల వివరాలను తెలియజేసేందుకు నిరాకరించడంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్ కలెక్టరేట్ : జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా 469 గ్రామాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1,94,687, నాలుగు అర్బన్ ప్రాంతాల్లో 26,609 మొత్తం 2,21,296 గృహాలున్నట్లు గుర్తించారు. జిల్లాను మొత్తం 1,571 బ్లాక్‌లుగా విభిజించారు. ఇందుకుగాను 1,724 మంది ఎన్యుమరేటర్లు, 286 మంది సూపర్‌వైజర్లు విధులను నిర్వహిస్తున్నారు. ఎన్యూమరేటర్లు ప్రతీ కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరించి (ఇంటి నంబరు, ఇంటి యజమాని పేరు వంటి వివరాలు) ఫారంలో నమోదు చేస్తున్నారు. ఈనెల 18 వరకు జిల్లావ్యాప్తంగా 1,54,083 గృహాలను ఎన్యూమరేటర్లు సర్వే పూర్తి చేశారు. ఇంకా 67,213 గృహాలు మాత్రమే సర్వే చేయాల్సి ఉంది.
రోజూ సాయంత్రం
డేటా ఎంట్రీ
రోజూ గ్రామాల్లో, వార్డుల్లో ముమ్మరంగా నిర్వహించిన సర్వే వివరాలను సాయంత్రం ఎంపీడీఓల ఆధ్వర్యలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర సర్వేను కలెక్టర్ రాహుల్‌రాజ్ రోజూ ఏదొక మండలంలో పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 18న కౌడిపల్లి మండలంలో జరుగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. అంతకు ముందు మెదక్ పట్టణంలోని 1వ వార్డులో జరుగుతున్న సర్వే సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎన్యూమరేటర్లకు కలెక్టర్ తమ కుటుంబ వివరాలను అందజేశారు.
అర్బన్ పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో...
మున్సిపాలిటీ మొత్తం సర్వే సర్వే
పేరు గృహాలు చేసినవి చేయాల్సినవి
మెదక్ 12,168 9,898 2,270
తూప్రాన్ 6,198 4,973 1,225
రామాయంపేట 3,993 2,944 3,993
నర్సాపూర్ 4,250 2,850 1,400
మొత్తం 26,609 20,665 1,400
Comments
Please login to add a commentAdd a comment