తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లా డారు. నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన భూ వివాదంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వగా, నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమో దు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులో ఉన్న విఠల్ కేసు నమోదు కాకముందే మరణించినట్లు మా విచారణలో తెలిందన్నారు. ఈ కేసు నుంచి ఆయన పేరును తొలగించామన్నారు. ఈనెల 8వ తేదీన మళ్లీ భూ వివాదం జరగగా నర్సాపూర్ పో లీస్‌స్టేషన్‌లో కేసు నమో దు చేసినట్లు వివరించారు. ఈ విషయంలో మీడియా, సోషల్ మీడి యాలో చనిపోయిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమో దు అని ఒక వర్గం త ప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment