గిరిజనుల జోలికి వస్తే ఊరుకోం
పాపన్నపేట(మెదక్): గిరిజన ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని బంజారా సేవాలాల్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూల్‌సింగ్ అన్నారు. బుధవారం లగచర్లకు వెళ్లకుండా పాపన్నపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూములను స్వాధీనం చేసుకోవడం తగదన్నారు. అక్రమ అరెస్ట్‌లు చేస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. తక్షణమే కేసులను ఎత్తివేసి అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు విఠల్, అమ్రూ, ప్రకాష్, శక్రు, లోక్యా, తుకారం, చందర్ పాల్గొన్నారు.
సర్వేను వేగవంతం చేయండి
పెద్దశంకరంపేట(మెదక్): సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఎన్యుమరేటర్లను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 80 శాతం వరకు సర్వే పూర్తయిందని తెలిపారు. కంప్యూటరీకణ చేపట్టాలని ఎంపీడీఓ రఫీఖ్‌ఉన్నీసాకు సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకటరాములు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలుతప్పనిసరి
నిజాంపేట(మెదక్): మండలంలోని నందిగామలో రామాయంపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా వ్యవసాయ అధి కారి గోవింద్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రైతులు నాణ్యమైన వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి రాజు, రైతులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలతో
పఠనాసక్తి పెంపు
మెదక్ కలెక్టరేట్: గ్రంథాలయాలతో విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుందని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ అన్నారు. కళాశాలలో కొనసాగుతున్న గ్రంథాలయ వారో త్సవాలు బుధవారంతో ముగిశాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో గ్రంథాలయాల పాత్రను విద్యార్థులకు వివరించారు. గ్రంథాలయ ఇన్‌చార్జి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా పెద్దలు చెప్పిన మాటను గుర్తుచేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్ట ర్ తిరుమలరెడ్డి, చంద్రశేఖర్, శరత్‌రెడ్డి, వామనమూర్తి, వెంకటేశ్వర్లు, విశ్వనాథం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శుద్ధనీటినే తాగాలి: డీపీఓ
టేక్మాల్(మెదక్): శుద్ధమైన నీటిని తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. టేక్మాల్‌లోని డాక్టర్ వాటర్ ప్లాంట్‌ను పంచాయతీ ఆధ్వర్యంలో పునరుద్ధరించగా బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ సుజాత, ఎంపీఓ రియాజొద్దీన్, ఈఓ రాకేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment