ట్రిపుల్ఆర్ భూముల రీ సర్వే
శివ్వంపేట(నర్సాపూర్): ట్రిపుల్ఆర్లో భూములు కోల్పోతున్న అసలైన రైతులను గుర్తించేందుకు రెవెన్యూ సిబ్బంది బుధవారం సర్వే చేపట్టారు. మండల పరిధిలోని సీతారం తండా, రత్నపూర్ భూములు సర్వే చేశారు. పలువురు రైతుల భూము ల నమోదులో వ్యత్యాసం ఉండడంతో అసలైన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ గతంలో రైతులు నర్సాపూర్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది భూముల సర్వే ముమ్మరంగా చేపట్టింది. అసలైన రైతులకు న్యా యం చేస్తామని ఆర్ఐలు కిషన్, సునీల్ తెలిపారు. మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వా లని భూ నిర్వాసితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment