హైవేకు ఆటంకం
గురువారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2024
అటవీ ప్రాంతంలో విస్తరణకు నోచుకోని రహదారి
అటవీశాఖ నిబంధనలు జిల్లాలోని జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి ఆటంకంగా మారాయి. రెండేళ్లుగా అనుమతులు రాకపోవడంతో రామాయంపేట– మెదక్ అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. అసంపూర్తి రోడ్డు నిర్మాణంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
రామాయంపేట(మెదక్): జిల్లా పరిధిలో మెదక్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు 70 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం రూ. 882 కోట్లు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అయితే మెదక్ నుంచి రామాయంపేట మధ్యలో నాలుగు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అక్కడ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కేంద్ర అటవీశాఖ అనుమతులు అవసరం కాగా, రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపారు. అటవీ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర 2,700 చెట్లను తొలగించాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. అటవీ ప్రాంతంలో కాకుండా మిగితా చోట్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.
తగ్గిన రోడ్డు విస్తరణ
అటవీ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు మధ్యలో నుంచి ఇరువైపులా 15 మీటర్ల చొప్పున విస్తరణకు గాను అనుమతుల కోసం అటవీశాఖకు ప్రతిపాదనలు పంపారు. దీంతో మొత్తం ఆరువేలకు పైగా చెట్లను తొలగించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాల మేరకు విస్తరణను 14 మీటర్లకు తగ్గించగా, స్థానిక అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు. విస్తరణ తగ్గడంతో అటవీ ప్రాంతంలో తొలగించాల్సిన చెట్ల సంఖ్య 2,700 తగ్గింది. అయితే అనుమతుల కోసం జిల్లా అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు గాను అనుమతులు రాకపోవడంతో ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పనులు సైతం నెమ్మదించాయి.
న్యూస్‌రీల్
నాలుగు కిలోమీటర్ల మేర రాని అటవీశాఖ అనుమతులు
రెండేళ్లుగా పెండింగ్‌లో పనులు
ఇబ్బంది పడుతున్న వాహనదారులు
Comments
Please login to add a commentAdd a comment