జోరుగా గంజాయి దందా!
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం
జిల్లాలోనే తూప్రాన్ ఉమ్మడి మండలంలో గంజాయి భారీగా పట్టుబడుతుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు గంజాయి విక్రయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలింది. ఇందుకోసం పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చెడు వ్యసనాలకు గురికాకుండ పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
– వెంకట్‌రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ
తూప్రాన్: ‘పట్టణంలోని ఓ దంపతులకు ఏకై క కుమారుడు. ఉన్నత చదువుల కోసం హైద రాబా ద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చేర్పించారు. అయి తే వారి కుమారుడు స్థానికంగా ఉన్న స్నేహితులతో కలిసి సరదాగా తిరగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. తల్లిదండ్రులు మందలించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు’.
జిల్లాలో గంజాయికి తూప్రాన్ అడ్డాగా మారింది. మండలంలో బీహార్, ఒడిషా, ఏపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన కొందరు గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో గంజాయి నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్‌లతో అమ్ముతున్నారు. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్‌ను రూ. 100 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పట్టణంలోని గోల్డెన్ పార్కు, నర్సాపూర్ చౌరస్తాలోని హోటల్, పట్టణ సమీపంలోని పెద్ద చెరువు కట్ట, నూతనంగా వెలిసిన వెంచర్లు, యువకులు అద్దెకు ఉంటున్న గదులను అడ్డాగా మార్చుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో గంజాయిని సిగరెట్లలో కలిపి తాగుతున్నారు. హైదరాబాద్‌లో పోలీసుల నిఘా పెరగడంతో డ్రగ్స్ మాఫియా పల్లె ప్రాంతాల్లోని యువతపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని కొందరు యువకులతో పరిచయం పెంచుకొని అమ్మకాలు చేయిస్తోంది. వీరిలో ఎక్కువగా మధ్య తరగతి వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. ఇటీవల మండలంలో గంజాయికి అలవాటుపడిన యువతను పోలీసులు సైతం గుర్తించారు.
తూప్రాన్ అడ్డాగా అమ్మకాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి బానిసవుతున్న యువకులు
ఈనెల 12వ తేదీన తూప్రాన్‌లో గంజాయి విక్రయిస్తూ నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు.
13వ తేదీన సుమారు 10 కిలోల గంజాయిని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో బీహార్, ఒడిషాకు చెందిన వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
గత నెల పట్టణంలోని కేశవనగర్‌లో ఓ యువకుడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
రామాయంపేట మండల పరిధిలో గంజాయి తరలిస్తున్న కారు బోల్తా పడడంతో నిందితులు గంజాయిని వదిలి పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment