మాకు న్యాయం చేయండి
నర్సాపూర్ రూరల్: మండలంలోని నారాయణపూర్ పంచాయతీ పరిధిలోని లచ్చి రాం తండాకు చెందిన దేవిసింగ్ తన కు టుంబ సభ్యులతో కలిసి గురువారం నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పూర్వీకుల నుంచి వచ్చి న భూమి విషయంలో పూర్తి విచారణ జరపకుండానే శ్రీనివాస్ అనే వ్యక్తి కొనుగోలు చేసి కబ్జాలో ఉన్నాడని నర్సాపూర్ సీఐ, ఎస్సై చెప్పడం విచారకరమన్నారు. డబ్బుల కోసం లాలూ చీ పడి మాకుటుంబంపై ఆరోప ణలు చే యడం సరికాదన్నారు. ఇప్పటికై నా న్యా యం చేయాలని కోరారు. ఈవిషయమై సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై లింగం వివరణ కోరగా.. దేవిసింగ్ కుటుంబ సభ్యులకు చెందిన భూమి ఉంటే చట్టప్రకారం కలెక్టర్, లేదా కోర్టుకు వెళ్లి చూసుకోవాలన్నారు. అనవసరంగా పోలీసులపై ఆరోపణలు చేయ డం సరికాదని అన్నారు.
జాతీయస్థాయి
పోటీలకు ఎంపిక
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి ఫ్లోర్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో నిర్వహించిన అండర్– 12 విభాగంలో 7వ తరగతి విద్యార్థులు శ్రావణి, స్రవంతి, వర్ణిక పాల్గొన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఏపీలోని గుంటూరులో జరిగే జాతీయస్థాయి పో టీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ వాణికుమారి, పీడీ బస్వరాజ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment