కులవృత్తులను ఆదుకోవాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని గోమారం పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేయాలన్నారు. చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేప పిల్లలు సకాలంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గోమారం మత్స్య సహకార సంఘం అఽ ద్యక్షుడు కుంట లక్ష్మణ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణగౌడ్, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మాధవరెడ్డి, చంద్రగౌడ్, మన్సూర్, రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్, నవీన్, నర్సింలు, నగేష్, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తన నివాసంలో సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్‌కు పూర్తి వివరాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment