తప్పులకు ఆస్కారం ఉండొద్దు
అదనపు కలెక్టర్ నగేష్
మెదక్‌జోన్: సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండొద్దని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. గురువారం డాటా ఎంట్రీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ నమోదులో ఎలాంటి చిన్న పొరపాటు దొర్లకుండా డాటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే సర్వే పూర్తయిన జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు 516 మంది డేటా ఎంట్రీ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆపరేటర్లు చేసిన డేటా ఎంట్రీని ఎన్యుమరేటర్ తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం సర్వే పూర్తయిందన్నారు. అంతకుముందు డేటా ఎంట్రీపై రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన ఈడీఎం సందీప్ ఆపరేటర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి బద్రీనాథ్, ఎంపీడీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment