కేవీకేలో హెలికాప్టర్ ట్రయల్‌రన్
కౌడిపల్లి(నర్సాపూర్): కేవీకేకు ఈనెల 25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వస్తుండటంతో సోమవారం కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు రెండు హెలికాప్టర్లతో ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. అనంతరం కేవీకే సమీపంలో మూడు హెలిప్యాడ్‌లు నిర్మించగా వాటిని సందర్శించారు. అలాగే సభా ప్రాంగణం, సేంద్రియ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు స్థలం, రూట్‌మ్యాప్, బ్లూ ప్రింట్‌ను పరిశీలించారు. కేవీకే హెడ్‌అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్రాత్రేయ నల్కర్ కేవీకే చేపట్టే కార్యక్రమాలను వారికి వివరించారు. వీరితో పాటు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గోపి, ఇన్‌చార్జి డీఏఓ వినయ్‌కుమార్ కేవీకేలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్‌డీఓ మహిపాల్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏఓ స్వప్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment