ఏకత్వం.. నూతనత్వం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అన్ని దారులూ సిద్దిపేట వైపే.. ఎటు చూసినా ఏబీవీపీ కార్యకర్తలే.. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తూ.. ఏకత్వంలో నూతనత్వం చాటుతూ.. జెండాలు చేతబూని విద్యార్థి లోకం కదిలింది. సోమవారం సిద్దిపేటలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. అఖిల భారత సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఏబీవీపీ అన్ని ప్రాంతాలను, వర్గాలను, కులమతాలను ఏకతాటిపైకి తీసుకువస్తోందన్నారు. జాతీయ పునర్నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. అలాగే సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. ఏబీవీపీ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, గోపన్న, రామన్నలు నక్సల్స్‌కు, వామపక్ష తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. విద్యార్థులందరూ చదువుతో పాటుగా శారీరక దారుఢ్యం కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉందని, అందుకు ఏబీవీపీ కృషి చేస్తుందన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి మాట్లాడుతూ.. ఏబీవీపీ 75 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, 55 లక్షల మందితో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించిందన్నారు. రానున్న రోజుల్లో మరింత విస్తరిస్తుందని అన్నారు.
కదిలిన ‘విద్యార్థి’ లోకం
అట్టహాసంగా ఏబీవీపీ
రాష్ట్ర మహాసభలు షురూ..
హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
Comments
Please login to add a commentAdd a comment