మెర్రీ క్రిస్మస్
సుందరంగా కరుణామయుడి కోవెల
ఏసయ్య మందిరం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిని రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. బుధవారం ఉద యం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించనుండడంతో అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపనుండగా.. ప్రత్యేక దుకాణాలు, రంగుల రాట్నాలతో చర్చి ఆవరణ జాతరను తలపిస్తోంది. క్రిస్మస్ తాతయ్య బొమ్మలు, ఏసయ్య శిలువలు, స్టార్‌లతో పాటు బైబిళ్లు ఆకట్టుకుంటున్నాయి.
– మెదక్‌జోన్
శతాబ్ధి వేడుకలకు చార్లెస్ వాకర్ వంశీకులు
శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మెదక్ చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ రక్త సంబంధీకులు సోమవారం చర్చిని సందర్శించారు. వారికి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి శాంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వాకర్ వారసులను కలిసి పలకరించారు.
Comments
Please login to add a commentAdd a comment