సీఎం పర్యటన విజయవంతం చేయాలి
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
పాపన్నపేట(మెదక్): సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు కోరారు. ఈనెల 25వ తేదీన సీఎం ఏడుపాయల పర్యటన నేపథ్యంలో సోమవారం దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్‌బాబు, జాయింట్ కమిషనర్ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏడుపాయల ప్రాశస్త్యం ప్రతిభింబించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మంజీరా పవిత్రత కనిపించాలన్నారు. నదిలో గుర్రపు డెక్కను తొలగించాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు దేవాదాయ కమిషనర్ శ్రీధర్‌బాబు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పరిసరాలను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎటు చూసిన భక్తి భావం వికసించాలన్నారు. ఆలయ చరిత్రలో మొదటిసారిగా వస్తున్న సీఎంకు ఘనస్వాగతం పలకాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment