క్రిస్మస్‌ను అధికారికంగా జరిపాం
చర్చిలో హరీశ్‌రావును ఆశీర్వదిస్తున్న బిషప్
మెదక్‌జోన్: క్రిస్మస్‌ను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి ఘనంగా నిర్వహించిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం మెదక్ చర్చి శతాబ్ధి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా చర్చి నిర్వాహకులు సన్మానించి ప్రత్యేక ప్రార్థన చేసి ఆశీర్వదించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏటా క్రిస్మస్ సందర్భంగా పేద క్రిస్టియన్లకు గిఫ్టులు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దిక్కిందన్నారు. అన్ని పండగలను సమానంగా గౌరవించి కేసీఆర్ పేదలను హక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఏడాది పాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మెదక్ చర్చి వందేళ్ల సంబురంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి ప్రార్థనా మందిరం ప్రఖ్యాతి గాంచిందన్నారు. చార్లెస్ వాకర్ నిర్మించిన ఈ చర్చి ఉత్సవాల్లో ఆయన మనుమడు పాల్గొనడం ఎంతో సంతోషకరం అన్నారు. చర్చి మెదక్ జిల్లాలో ఉండడం యావత్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. అంతకుముందు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి తదితరులు ఉన్నారు.
గిఫ్టులు సైతం అందజేశాం
మెదక్ చర్చి శతాబ్ధి వేడుకల్లో
మాజీ మంత్రి హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment