విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు
పాపన్నపేట(మెదక్)/మెదక్‌జోన్: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాపన్నపేట మండలం చీకోడు, లింగాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాలను సందర్శించారు. ముందుగా విద్యార్థుల భోజనశాల, స్టోర్ రూం, మరుగుదొడ్లను పరిశీలించారు. మెను అమలు తీరుపై హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే మెను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట చీకోడ్ హెచ్‌ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మెదక్ టీజీఎస్‌డబ్లూఏఆర్‌ఎస్ (వెలుగు) పాఠశాలకు చెందిన విద్యార్థిని సంజన తయారు చేసిన బహుళ ప్రయోజక చేతికర్ర జాతీయస్థాయికి ఎంపికై నట్లు డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్‌రాజ్ విద్యార్థిని అభినందించారు. అలాగే రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు మరో మూడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇదేస్ఫూర్తితో జాతీయస్థాయిలో దక్షిణ భారత స్థాయిలో రాణించి జిల్లాకు మంచి గుర్తింపు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment