చైనా మాంజా విక్రయిస్తే చర్యలు
మెదక్ మున్సిపాలిటీ: ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. గురువారం మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి ఫతేనగర్ వీధిలో ఇద్దరు వ్యాపారుల రూ. 3,584 విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చైనా మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదకరమని తెలిపారు. రోడ్డుపై వాహనదారుల మెడకు చుట్టుకొని చనిపోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తున్న, కలిగి ఉన్న వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ అమర్, ఏఎస్‌ఐ రుక్సానా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment