క్రీడలతో దేహదారుఢ్యం
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కార్యాలయ పరిధిలోని పోలీస్‌గ్రౌండ్‌లో గత రెండు రోజులుగా కొనసాగిన జిల్లాస్థాయి క్రీడలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హాజరై మాట్లాడారు. క్రీడలతో దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. పోటీల్లో డీఏఆర్‌జట్టు, మెదక్ డివిజన్ జట్టు, తూప్రాన్ డివిజన్ జట్టు పాల్గొన్నట్లు చెప్పారు. బాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, తగ్గఫ్‌వార్, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్యూఆర్ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్ సేకరణ
పోలీసుల పనితీరు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అన్ని పోలీస్‌స్టేషన్లలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్‌శాఖ రూపొందించిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ పోస్టర్లను గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. అంతకుముందు డీజీపీ జితేందర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ పోస్టర్లను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమ ంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment