ఇష్టానుసారంగా పేర్ల్లు నమోదు
మనోహరాబాద్(తూప్రాన్): ప్రభుత్వం రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసాపథకాల కోసం మంగళవారం అధికారులు చేపట్టిన గ్రామసభల్లో నిరసనలు, ఆందోళనలు ఎదురయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన సర్వేల్లో లబ్ధిదారుల పేర్లను అధికారులు ప్రకటించడంతో గ్రామస్తులు నిరసన చేశారు. అసలు అర్హులను గుర్తించకుండా ఇష్టారీతిన పేర్లు ఎలా నమోదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌కార్డుల్లో దరఖాస్తు చేసిన వారికి రాలేదని వాపోయారు. కోనాయపల్లి(పీటి)లో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూం ఉన్నవారికి, బిల్డింగ్‌లున్న వారికి ప్రకటించారని తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ గ్రామస్తులను ఆందోళన విరమింపజేశారు. దండుపల్లి, కోండాపూర్, పర్కిబండ, జీడిపల్లి, వెంకటాపూర్ అగ్రహారం గ్రామాల్లో సైతం నిరసనలు చేశారు.
నామమాత్రంగా గ్రామసభలు
వెల్దుర్తి(తూప్రాన్): ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో మంగళవారం నూతన రేషన్‌కార్డులు మంజూరు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామసభలు నిర్వహించారు. కాగా ఆయా పథకాల్లో లబ్ధిదారులకు సంబంధించి వచ్చిన వివరాలను గ్రామసభల్లో అధికారులు చదివి, వినిపించడం వరకే పరిమితమయ్యారు. జాబితాలో పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆత్మీయ భరోసా జాబితాలో భూములు ఉన్నవారినే ఎంపిక చేశారని, ఈ విషయంలో అధికారులు విచారణ చేపట్టి అర్హులను గుర్తించాలంటూ శెట్టిపల్లికలాన్ గ్రామసభలో గ్రామస్తులు విన్నవించారు. కుటుంబంలో తల్లిదండ్రుల పేరిట భూములున్నా.. వారి కుమారులను ఆత్మీ య భరోసా కింద ఎంపిక చేశారని, కానీ గుంట జాగా లేని కౌలు రైతులను మాత్రం విస్మరించారని వాపోయారు.
కోనాయపల్లి(పీటి)లో గ్రామస్తుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment