26 నుంచి సీఎం కప్ క్రికెట్ పోటీలు
నర్సాపూర్: తెలంగాణ సీఎం కప్ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఈనెల 26 నుంచి నిర్వహిస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందుకు మైదానాన్ని చదును చేసే పనులు చేపట్టామని వివరించారు. పోటీల్లో పాల్గొన దలచిన క్రీడాకారులు ఎంట్రీ ఫీజు రూ.7999 చెల్లించి తమ టీం పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. కాగా ప్రథమ బహుమతి రూ.ఒక లక్ష 909లు, ద్వితీయ బహుమతి రూ.50వేల 909లు అందజేస్తామని వివరించారు. కాగా పోటీల్లో పాల్గొన దలచిన క్రీడాకారులు 94929 11704 మోబైల్ నంబరులో మరింత సమాచారం కోసం సంప్రదించాలని కోరారు. కాగా మైదానం చదును చేసే పనులు రిజ్వాన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment