122 మంది బాలలకు విముక్తి
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 122 మంది బాలలకు వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 122 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చామని వివరించారు. ఇతర రాష్ట్రాల పిల్లలను వారి తల్లితండ్రులు వచ్చే వరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే సంరక్షణ కేంద్రాల్లో ఉంచుతామన్నారు. బాలల పరిరక్షణ విభాగం, పోలీస్, లేబర్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించిందని పేర్కొన్నారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment