పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
హవేళిఘణాపూర్(మెదక్): గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ఆ దిశగా అంగన్‌వాడీ టీచర్లు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని బ్యాతోల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. పాఠాలు బోధించి పలు ప్రశ్నలు అడిగారు. వారు అందుకు బదులివ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అంగన్‌వాడీల్లో చదివే చిన్నారులను తమ సొంత పిల్లలుగా భావించి వారికి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు మంచి ఆహారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. దీనిపై అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగునీటి కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి డంప్‌యార్డులకు తరలించాలని ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment