క్రీడల్లో గెలుపోటములు సహజం
తూప్రాన్: క్రీడల్లో గెలుపోటములు సహజమని మ ండల విద్యాధికారి సత్యనారాయణ అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ అండర్–14 బాల, బాలికల క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన మఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో రాణించడం వల్ల మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రభుత్వం అన్ని విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. క్రీడాకారులు మంచి నైపుణ్యాలను సాధించడానికి ప్రణాళికతో కూడిన శిక్షణ తీసుకోవాలని సూచించారు.
ఫైనల్‌లో హోరాహోరీ
మెదక్, నిజామాబాద్ బాలుర జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరు జట్ల మధ్య మూడు పర్యాయాలు జరిగిన మ్యాచ్‌లలో రెండు జట్లు సమాన స్కోర్ సాధించి బరిలో నిలవడం, ఫలితం తెలకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. చివరగా జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ 6, మెదక్ 5 పాయింట్లు సాధించాయి. నిజామాబాద్ జట్టు ప్రథమ స్థానం, మెదక్ జట్టు ద్వితీయ, ఆదిలాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు ప్రథమ, మహబూబ్‌నగర్ ద్వితీయ, ఆదిలాబాద్ తృతీయ స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్ కో ఆర్డినేటర్ శ్యాంసుందర్‌శర్మ, గోవర్ధన్, రాష్ట్ర పరిశీలకులు గంగ మోహన్, రవికుమార్, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎంఈఓ సత్యనారాయణ ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు విజేతగా నిలిచిన నిజామాబాద్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment