ఉపాధిలో అవకతవకలు సహించం
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్
రామాయంపేట(మెదక్): ఉద్యోగులు, మైనర్లతో ఉపాధి పనులు చేయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. రామాయంపేటలో శుక్రవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లు అడిట్‌లో తేలిందన్నారు. వారికి జరిమానా విధించడంతో పాటు డబ్బులు రికవరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పనులు చేయని వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు, ఒకరి పేరుపై మరొకరు పనులు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు రూ. 72,517 రికవరీ చేశామని, రూ. 15,082 జరిమానా విధించినట్లు వివరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి శ్రీహరి, ఎంపీడీఓ సజీలుద్దీన్, ఏపీఓ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment