భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
డీఈఓ రాధాకిషన్
మెదక్ కలెక్టరేట్/చేగుంట(తూప్రాన్): విద్యార్థులు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. శుక్రవారం ‘కలాం స్ఫూర్తి యాత్ర’ చేరుకోగా.. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కలాం స్ఫూర్తి యాత్ర విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచుతుందని అన్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి మాట్లాడుతూ.. రోబోటిక్స్, ఏఐ, డ్రోన్ల పనితనం, త్రీడీ బొమ్మలు వంటి వివిధ అంశాలను మొబైల్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు అందించడం ఉపయోగకరమన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో డీఈఓ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆపార్ ఐడీ చేయించాలని ఆదేశించారు. అలాగే చేగుంట మండలంలోని చందాయిపేట జెడ్పీ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించగా.. డీఈఓ ఓటు వినియోగించుకుని మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment