‘విద్యుత్ ఉద్యోగులపైఎస్మా సరికాదు’
మెదక్ కలెక్టరేట్: చంఢీగడ్ విద్యుత్ ఉద్యోగులపై ఎస్మా విధింపు చర్యలు మానుకోవాలని టీజీ యూఈఈయూ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంఢీగడ్‌లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 50 రోజులుగా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులపై అణచివేత చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రంథాలయ వేళలు మార్చండి
మెదక్ కలెక్టరేట్: జిల్లా గ్రంథాలయ వేళలు ఇబ్బందిగా మారాయని, వాటిని మార్చాలని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కోరారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకే గ్రంథాలయానికి తాళం వేయడంతో గత్యంతరం లేక ఆవరణలోనే కూర్చొని చదువుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవని, ఈ ప్రభుత్వం ఇస్తుండడంతో చదువుకుందామంటే అవకాశం లేకుండా పోతుందని వాపోయారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment