అధికారులపై అజ్జమర్రి స్థానికుల ఆగ్రహం
చిలప్‌చెడ్(నర్సాపూర్): ప్రజాపాలన గ్రామసభలో అధికారులు ప్రకటించిన పలు పథకాల్లో అనర్హుల పేర్లు ఉన్నాయి. దీంతో అజ్జమర్రి గ్రామస్తులు ఇది ఇందిరమ్మ కమిటా.. కాంగ్రెస్ నాయకుల కమిటీయా అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మంగళవారం మండల పరిధిలోని అంతారం, సామ్లా తండా, బద్య్రాతండా తండాల్లో ప్రజాపాలన గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయి. అజ్జమర్రి గ్రామంలో మాత్రం రసాభసాగా సాగింది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పూర్తిగా ఇళ్లు లేని వాళ్ల పేర్లు లేకపోవడం, అందుకు అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. గతంలో ఉన్న కమిటీ సభ్యులే ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా కొనసాగాలని గ్రామ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, ఎంపీడీఓ ఆనంద్‌లకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ పథకంలో అర్హులుగా భూమి ఉన్న వారిని ఎంపిక చేయడం ఎంటని వాపోయారు. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై గ్రామస్తులు కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు బాల్‌రాజ్, మల్లయ్య, శ్రీశైలం, నగేష్, సత్యం, మల్లేశం, వీరాస్వామి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment