కూచారంలో యూత్ భవనం పరిశీలన
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని కూచారంలో యూత్ భవనం పాక్షికంగా కూలిన వార్త సాక్షిలో ప్రచురితమైంది. దీంతో ఈ కథనానికి స్పందించి మండల ప్రత్యేక అధికారి, జిల్లా పీఆర్ ఈఈ నర్సింలు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవనం మరమ్మతులకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరి వెంట పీఆర్ ఏఈ మధు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
చిలప్‌ఎడ్(నర్సాపూర్): చాముండేశ్వరీ ఆలయ ప్రాంగణంలో చాముండేశ్వరీ సేవా సమితి, శాక్త మండల్ ఆధ్వర్యంలో బాలాజీ ఆస్పత్రి సంగారెడ్డి వారి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. శిబిరానికి సుమారు 400 మంది రోగులు వచ్చారని, అవసరమైన వారికి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు సైతం నిర్వహించామన్నారు. ఉచితంగా ముందులు పంపిణీ చేశామన్నారు. అత్యవసర చికిత్స అవసరమున్న రోగులకు ఆస్పత్రికి రావాలని సూచించామన్నారు. కార్యక్రమంలో వైద్యులు శైలజ, వేణుగోపాల్, పవన్‌కుమార్, సందీప్‌రెడ్డి, శ్రావణి, అక్బర్, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment