దరఖాస్తులు చేసినా రేషన్‌కార్డులు రాలె..
కూకుట్లపల్లిలో జనం ఆగ్రహం
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కూకుట్లపల్లి గ్రామసభ రసాభాసగా జరిగింది. మంగళవారం గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ పుణ్యదాస్ ఇతర అధికారులు గ్రామసభకు హాజరుకాగా పంచాయతీ కార్యదర్శి రమేశ్ రేషన్‌కార్డుల మంజూరు జాబితా చదివి వినిపించారు. దీంతో ప్రజాపాలనలో రేషన్‌కార్డుల కోసం వందకుపైగా దరఖాస్తు చేసుకుంటే కేవలం 25 మందికి మాత్రమే వచ్చాయని మిగతా దరఖాస్తులు ఏం చేశారని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు మంజూరు చేస్తున్నారని, రైతుభరోసా తప్పుడు సర్వే చేశారని, ఇళ్లు లేని వారిని ఉన్నాయని చెప్పడం ఏమిటని వారు అధికారులను నిలదీశారు. దీంతో గ్రామసభలో గందరగోళం నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కాంతారావు, ఇక్బాల్, వెంకన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment