డిష్యుం... డిష్యుం... | Allu Arjun Pushpa 2: The Rule Movie Updates | Sakshi
Sakshi News home page

డిష్యుం... డిష్యుం...

Published Wed, Jul 3 2024 12:17 AM | Last Updated on Wed, Jul 3 2024 9:33 AM

Allu Arjun Pushpa 2: The Rule Movie Updates

డిష్యుం... డిష్యుం అంటూ ఫైట్‌ చేయనున్నారు పుష్పరాజ్‌. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. ‘పుష్ప’ నుంచి ఇప్పటికే ‘పుష్ప: ది రైజ్‌’ విడుదలై, ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌ అండ్‌ సుకుమార్‌.

ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ వారంలో హైదరాబాద్‌ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కానుందని తెలిసింది. అల్లు అర్జున్‌ పాల్గొనగా ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారని, ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ క్లైమాక్స్‌లో రానుందని సమాచారం. మరి క్లైమాక్స్‌లో డిష్యుం... డిష్యుం అంటూ విలన్స్‌ను పుష్పరాజ్‌ ఏ విధంగా రఫ్ఫాడించాడో చూడాలంటే డిసెంబరు 6న థియేటర్స్‌కు వెళ్లాలి. ఆ రోజునే ‘పుష్ప: ది రూల్‌’ విడుదల కానుంది. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సునీల్, అనసూయ, జగపతిబాబు, ఫాహద్‌ ఫాజిల్‌ ఈ సినిమాలోని ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement