మరో మూడు నెలల్లో కాజల్ అగర్వాల్ తల్లవుతారు. మే చివర్లో డెలీవరీ అని ఇటీవల పేర్కొన్నారు కాజల్. ఇక బిడ్డ ఆరోగ్యం, తన ఆరోగ్యం కోసం ఏరోబిక్స్, పైలెట్స్ చేస్తున్నారు. ‘‘ఈ వ్యాయామాలన్నీ అతిగా చేయకూడదు.. అవసరమైనంతవరకే చేయాలి’’ అని కాజల్ అన్నారు. ఇన్‌స్టా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘గర్భం దాల్చడం అనేది ఓ వినూత్న అనుభూతి. ఎలాంటి సమస్యలు లేని గర్భవతులను ఏరోబిక్స్ చేయడానికి ప్రోత్సహించాలి.
ప్రెగ్నెన్సీ సమయంలో శరీరానికి బలాన్ని చేకూర్చే వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఇంతకుముందు చేసిన ఎక్సర్‌సైజ్‌ల వల్ల, ఇప్పుడు గర్భం దాల్చాక చేస్తున్న వాటి వల్ల ఫిట్‌గా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ఏరోబిక్స్, పైలెట్స్ వల్ల నాకు అదనపు బలం వచ్చినట్లు అనిపిస్తోంది. అయితే కఠినమైన ఏరోబిక్స్ చేయడం ఇప్పుడు సరికాదు. తేలికపాటివి చేస్తే సరిపోతుంది’’ అంటూ ట్రైనర్ ఆధ్వర్యంలో తాను వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేశారు కాజల్ అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment