బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యింది. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టును పంచుకుంది.. ''మీరు ఎవరి జోలికైనా వెళ్లేముందు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో వారిని ఎవరు రక్షిస్తున్నారో మీకు తెలీదు” అంటూ ఓ శివుడి ఫొటోను శ్వేతా పోస్ట్ చేస్తూ ‘హర హర మహాదేవ’ అంటూ ఓ క్యాప్షన్‌ను జోడించారు. ఈ పోస్ట్‌కు అంకితా కూడా స్పందించింది. సుశాంత్ దేవుడి బిడ్డని, ఆ పరమశివుడే న్యాయం చేస్తాడంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. బుధవారం సుశాంత్ కేసును సీబీఐకి బదిలీ చేశాక శ్వేతా తన ఫేస్‌బుక్ ఫ్రొఫైల్‌ను మార్చింది. సుశాంత్ ముఖం సగభాగం, మిగతాది శివుడి ముఖంతో ఉంది. జస్టిస్ ఫర్ సుశాంత్, హరహర మహాదేవ్ ,జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ఓ క్యాప్షన్‌ను జతచేసింది. సుశాంత్ కూడా శివుడి భక్తుడని సన్నిహితులు తెలిపారు. అంతేకాకుండా చారిత్రక రామమందిరం ఆలయ శంకుస్థాపన జరిగిన రోజే సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడం పట్ల ఆయన కుటుంసభ్యులు, ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నిజాలు బయటకు రావాల్సి ఉందని అంకితా సైతం పోస్ట్ చేశారు. (ఇది పూర్తిగా చట్టవిరుద్ధం: రియా చక్రవర్తి)
ఇక సుశాంత్ కేసు విచారణ మొదలైనప్పటి నుంచి అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన రియా చక్రవర్తి ఎట్టకేలకు శుక్రవారం ముంబైలోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. మొదట తాను హాజరుకానంటూ ఈ-మెయిల్ సందేశం పంపినా ఈడీ సమస్ల నేపథ్యంలో హాజరు కాక తప్పలేదు. ఈ కేసులో రియాతో పాటు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ పేర్లను కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. దీంతో రియా తన సోదరుడు షోయిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తితో కలిసి శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యింది. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో గల నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. మొదట నెపోటిజం, డిప్రెషెన్‌తోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంబై పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టారు. అయితే సుశాంత్ తండ్రి బీహార్‌లో ఇచ్చిన ఫిర్యాదు తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్యేనంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడంతోపాటు ప్రాధాన్యత సంతరించుకుంది. (ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?)
Comments
Please login to add a commentAdd a comment