ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
హన్మకొండ: జిల్లాల్లో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో మంత్రి శనివారం వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్షించారు.ఽ ధాన్యం కొనుగోళ్లపై తీసుకోవాల్సిన చర్యల గురించి పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్.చౌహాన్ అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఫోన్ నంబర్‌తో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, దివాకర, అధికారులు పాల్గొన్నారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment