భూగర్భ కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

భూగర్భ కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు

Published Tue, Apr 16 2024 1:20 AM | Last Updated on Tue, Apr 16 2024 1:20 AM

భూగర్భ కేంద్రంలో అగ్ని ప్రమాద  నివారణ
 పరికరాలు ప్రదర్శిస్తున్న అధికారులు  - Sakshi

దోమలపెంట: టీఎస్‌ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్‌ కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను కేంద్రం సీఈ సూర్యనారాయణ సోమవారం ప్రారంభించారు. తొలిరోజు అగ్ని ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన బ్యానర్లు, ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలు ప్రదర్శించి కేంద్రంలో ఉన్న ఫైర్‌స్టేషన్‌ను పరిశీలించారు. మొత్తం 7 రోజులపాటు ఒక్కొక్క రోజు అగ్నిప్రమాద నివారణకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కేంద్రంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో అగ్నిప్రమాద నివారణపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ (ఓఅండ్‌ఎం) ఆదినారాయణ, సేఫ్టీ అధికారి డీఈ శ్రీకుమార్‌గౌడ్‌, ఎస్‌పీఎఫ్‌ ఆర్‌ఐ సూర్యరావు, ఏడీఈ రాము, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ మల్లికార్జున, ఫైర్‌, (ఓఅండ్‌ఎం) సిబ్బంది పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం

నాగర్‌కర్నూల్‌ క్రైం: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చుట్టుపక్కల ప్రమాదాలు జరిగితే సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి కృష్ణ్ణమూర్తి అన్నారు. ఈ నెల 14 నుంచి జిల్లాలో నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ కాలనీలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రయోగాత్మక ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ సందర్భంగా అగ్ని రాజుకుంటే ఏవిధంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.. మంటలను ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలో అవగాహన కల్పించారు. అనంతరం అగ్నిమాపక శాఖాధికారి మాట్లాడుతూ వేసవి దృష్ట్యా దుకాణాలు, ఇళ్లలో విద్యుత్‌ వాడకం పెరుగుతుందని, దీంతో షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడి నిప్పు రాజుకోవడం, మంటలు చెలరేగడం జరుగుతాయన్నారు. నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించి భారీ స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలను వారోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement